Manishi - Jeevitham

జీవితమంటే ఇన్ని కష్టాల కడగండ్లా?
ఇంత కన్నీటి ప్రవాహంలో కూడా మనిషి కష్టాలకడలిని ఎలా దాటుతున్నాడో?
జీవితమంటేనే నాకు భయంగా ఉంది...
ఇక ముందు ఉండే అంత జీవితాన్ని దాటాలంటే....
లేనివాడికి బ్రతకడానికి ఉంటే  చాలన్న ఆశ...
ఉన్న వాడికి ఉన్నదానికంటే రెట్టింపు కావాలన్న ఆశ...
మరి పోయేటప్పుడు ఏమయినా తీసుకు పోతాడా అంటే.... ఏమీ తీసుకెళ్ళలేని అశక్తత...
అయినా...
ఆశ ఆవిరి కాదు,
కోరిక కుదురుకోనీయదు...
కోరికల కొలనులో కొట్టుకుంటూ,
తీరని తావులకు చేరాలని పరుగుల పయనం...
చేరలేని, చేయలేని చేతకానితనం...
బ్రహ్మ రాసే బ్రదుకాటలో కొందరికే విజయం, ఎందరికో అపజయం...
అపజయాన్ని కూడా సంతోషంగా ఎదుర్కొని బ్రదికే తెగువ ఒక్క మనిషికే ఇచ్చిన భగవంతుడే కదా! గొప్ప వేటగాడు...
తలరాతలు రాసే ఓ విధాతా! మా రాతలలా నీ రాత ఉంటే తెలిసేది బ్రదుకెంత దుర్భరమని....
చేతితో చేసినంత, వేలితో రాసినంత సులువు కాదు.
నీవు రాసిన రాతని ఎదుర్కొని నిలవడమంటే!
నీవు మా స్థానే ఉంటే తెలిసేది జీవితపు లోతు...
పైకి రాలేక, రాతలు రాయలేక అక్కడే చచ్చేవాడివి...
అప్పుడైనా కానీ ఈ మనుషుల రాతలు మారేవేమో!

రత్నం




Jeevitham gurinchi raasina ee kavithani chaduvuthunna koladhi chadavali anipisthundi. Okkasari chadivithe thanivi theerinattu anipinchakapovadam ee kavitha goppathanam. Kavi thana hrudaya lothullo nundi, thana jeevithapu anchulalo nundi rasi untaru kavocchu.

Meru kuda matho me alochanalani share chesukovali anukunnattu ithe maku mail cheyandi. Meru pampina article ni post chesinappudu me peru ni kuda memu post chesthamu. Alage meru me social network profile ni link cheyali anukunnattu ithe maku me social profile link ni kuda meru mail chesinattu ithe memu adhi kuda link chesthamu. Maku mail cheyadaniki Write for Us ni open cheyandi. Thank you - All Telugu Fun.

No comments

Powered by Blogger.